ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 16:22:25

కోవిడ్‌తో ఎయిర్ ఇండియా ఉద్యోగులు మృతి.. కుటుంబ‌స‌భ్యుల‌కు ‌న‌ష్ట‌ప‌రిహారం

కోవిడ్‌తో ఎయిర్ ఇండియా ఉద్యోగులు మృతి.. కుటుంబ‌స‌భ్యుల‌కు ‌న‌ష్ట‌ప‌రిహారం

హైద‌రాబాద్‌: కోవిడ్ వ‌ల్ల మృతిచెందిన సిబ్బందికి నష్ట‌ప‌రిహారాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. దీనికి సంబంధించి ఆ సంస్థ ఓ అధికారిక స‌ర్క్యూల‌ర్‌ను జారీ చేసింది.  మృతిచెందిన వారి కుటుంబ‌స‌భ్యుల‌కు న‌ష్ట‌ప‌రిహారాన్ని అందివ్వ‌నున్న‌ట్లు చెప్పింది. అయితే ఎంత మంది సిబ్బందికి వైర‌స్ సంక్ర‌మించింది, ఎంత మంది మ‌ర‌ణించార‌న్న దానిపై స్పందించేంద‌కు ఎయిర్ ఇండియా ప్ర‌తినిధి నిరాక‌రించారు. ఎయిర్ ఇండియా సిబ్బందిలోని అనేక మంది ఉద్యోగుల‌కు కోవిడ్ పాజిటివ్ వ‌స్తున్న‌ద‌ని, ఆ మ‌హ‌మ్మారి సోకి కొంద‌రు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు జూలై 20వ తేదీన జారీ అయిన స‌ర్క్యూల‌ర్‌లో తెలిపారు. కుటుంబ‌స‌భ్యు‌ల ప్ర‌యోజ‌నాల దృష్ట్యా.. మ‌ర‌ణించిన వారి న్యాయ‌ప‌ర‌మైన వార‌సుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌నున్న‌ట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఒక‌వేళ ప‌ర్మ‌నెంట్ ఉద్యోగులు చ‌నిపోతే, వారి కుటుంబాల‌కు 10 ల‌క్ష‌ల ప‌రిహారాన్ని ఇవ్వ‌నున్నారు.  ఫిక్స్‌డ్ ట‌ర్మ్ కాంటాక్ట్ ఉద్యోగుల‌కు 5 ల‌క్ష‌లు, ఏడాది కాలం ప‌నిచేసిన క్యాజువ‌ల్ ఉద్యోగుల‌కు 90 వేలు ఇవ్వ‌నున్న‌ట్లు స‌ర్క్యూల‌ర్‌లో తెలిపారు. 


logo