శుక్రవారం 05 జూన్ 2020
National - May 12, 2020 , 12:33:23

కరోనాతో ఎయిర్‌ ఇండియా‌ ఆఫీస్‌ మూసివేత

కరోనాతో ఎయిర్‌ ఇండియా‌ ఆఫీస్‌ మూసివేత

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా కార్యాలయాన్ని మూసివేశారు. అందులో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు ఆఫీస్‌ను తాత్కాలికంగా మూసివేశారు. జ్వరం, దగ్గు వంటి కరోనా లక్షణాలతో ఉద్యోగికి పరీక్షలు నిర్వహించారు. అందులో పాజిటివ్‌ అని తేలిందని ఎయిర్‌ ఇండియా అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఐదుగురు ఎయిర్‌ పైలట్లకు కరోనా పాజిటివ్‌ అని వచ్చింది. అయితే వారికి సోమవారం సాయంత్రం మరోమారు పరీక్షలు నిర్వహిచగా నెగెటివ్‌ అని తేలింది. కాగా, వారిని 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు. 


logo