మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Oct 01, 2020 , 17:34:22

వీవీఐపీ విమానం.. ఎయిర్ ఇండియా వ‌న్ వ‌చ్చేసింది

వీవీఐపీ విమానం.. ఎయిర్ ఇండియా వ‌న్ వ‌చ్చేసింది

హైద‌రాబాద్‌: వీవీఐపీ విమానం.. ఎయిర్ ఇండియా వ‌న్ వ‌చ్చేసింది.  రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని ప్ర‌యాణించే విమానం ఇవాళ ఢిల్లీ విమానాశ్ర‌యంలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ల్యాండ్ అయ్యింది.   అమెరికాలోని డ‌ల్లాస్‌లో త‌యారైన ఈ విమానం ఇండియాకు చేరుకోవ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.  ఎయిర్‌ఫోర్స్ వ‌న్ త‌ర‌హాలో ఉండే ఈ విమానంలో అడ్వాన్స్ క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ ఉన్న‌ది.  ఆకాశంలో వెళ్తున్న స‌మ‌యంలో ఈ విమానం నుంచి ఆడియో, వీడియో క‌మ్యూనికేష‌న్ చేయ‌వ‌చ్చు.  అది కూడా హ్యాకింగ్ జ‌ర‌కుండా చూడ‌వ‌చ్చు.   

ఎయిర్ ఫోర్స్ వ‌న్ త‌ర‌హాలో.. 

అమెరికా అధ్య‌క్షుడు ప్ర‌యాణించే ఎయిర్ ఫోర్స్ విమానం త‌ర‌హాలో.. భార‌త ప్ర‌ధాని కోసం ఎయిర్ ఇండియా విమానాన్ని త‌యారు చేశారు.  ప్ర‌ధాని మోదీ ఆ బోయింగ్ 777 విమానాన్ని వాడ‌నున్నారు.  అమెరికాలోని డ‌ల్లాస్‌లో దీన్ని నిర్మించారు.  ప్ర‌ధానితో పాటు రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి కూడా ఈ విమానాన్ని వాడ‌నున్నారు.  ఎయిర్ ఇండియాన వ‌న్‌లో అద్భుత‌మైన ఫీచర్లు ఉన్నాయి. భ‌ద్ర‌తాప‌ర‌మైన‌ ఫీచ‌ర్లు కూడా చాలానే ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.  ఒక‌సారి రీఫ్యుయ‌లింగ్ చేస్తే ఎయిర్ ఇండియా వ‌న్‌.. అమెరికా నుంచి ఇండియా వ‌ర‌కు ఎక్క‌డా బ్రేక్ లేకుండా రాగ‌ల‌దు. అమెరికా అధ్య‌క్షులు వాడే ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానం.. దాదాపు 1013 కిలోమీట‌ర్ల వేగంతో సుమారు 35వేల ఫీట్ల ఎత్తులో ప్ర‌యాణించ‌గ‌ల‌దు.  అయితే ఇదే త‌ర‌హాలో ఎయిర్ ఇండియా వ‌న్ విమానం కూడా గంట‌కు 900 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణించ‌నున్న‌ది. 

వైమానిక ద‌ళానికి చెందిన పైల‌ట్లు.. ఎయిర్ ఇండియా వ‌న్ విమానాన్ని న‌డ‌ప‌నున్నారు. శ‌త్రు రేడార్ సిగ్న‌ల్స్‌ను అడ్డుకునే జామ‌ర్లు దీంట్లో ఉంటాయి. గాలిలోనే ఇంధ‌నాన్ని నింపుకునే సామ‌ర్థ్యం ఉంటుంది.  ఎయిర్ ఇండియా వ‌న్‌లో అడ్వాన్స్‌, సెక్యూర్డ్ క‌మ్యూనికేష‌న్ సిస్ట‌మ్ ఉన్న‌ది.  ఆడియో, వీడియో క‌మ్యూనికేష‌న్‌.. మార్గ‌మ‌ధ్య ప్ర‌యాణంలో కూడా ప‌నిచేస్తాయి. హ్యాకింగ్ కానీ, టేపింగ్‌కు కానీ అవ‌కాశం లేకుండా క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ ప‌నిచేయ‌నున్న‌ది. 


logo