ఆదివారం 07 జూన్ 2020
National - Apr 02, 2020 , 21:25:31

ఎగ‌ర‌నున్న‌ ఎయిర్ ఇండియా విమానాలు

ఎగ‌ర‌నున్న‌ ఎయిర్ ఇండియా విమానాలు

న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల‌వుతున్న క్ర‌మంలో దాదాపు రెండు వారాల తర్వాత దేశీయ విమానాలు తొలిసారిగా న‌డ‌వ‌నున్నాయి. ఇక్క‌డ‌ చిక్కుపోయిన జర్మనీ, కెనడా, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌  పౌరులను తరలించేందుకు వీటిని ర‌న్‌ చేయ‌నున్న‌ట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ మేర‌కు  18 విమానాలను నడపనున్నట్టు ఎయిర్‌ ఇండియా సీఎండీ రాజీవ్‌ బన్సల్‌ వెల్లడించారు.  ఆయా దేశాల రాయబార కార్యాలయాల అభ్యర్థన మేరకు 18 చార్టడ్‌ విమానాలను నడుపుతామన్నారు. అయితే దేశాల నుంచి విమానాలు తిరిగొచ్చేటప్పుడు మాత్రం ఖాళీగానే వస్తాయని స్పష్టం చేశారు. అటు విదేశాల నుంచి వైద్య పరికరాలు తీసుకొచ్చేందుకు 4, 5 తేదీల్లో కార్గో విమానాలు న‌డ‌వ‌నున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో పైల‌ట్లు, సిబ్బందికి ప‌టిష్ట‌మైన ఏర్పాట్లు శానిటైజర్లు, గ్లోవ్స్‌, మాస్కులతో పాటు వ్యక్తిగత రక్షణ పరికరాలు సమకూరుస్తామన్నారు. విదేశాల‌కు నుంచి వ‌చ్చాక క్వారంటైన్‌లో సిబ్బంది ఉండనున్నారు.


logo