మంగళవారం 26 జనవరి 2021
National - Jan 08, 2021 , 11:23:16

కొవిడ్ న్యూ స్ట్రెయిన్ విస్త‌ర‌ణ‌.. యూకే నుంచి ఢిల్లీకి ఫ్లైట్‌

కొవిడ్ న్యూ స్ట్రెయిన్ విస్త‌ర‌ణ‌.. యూకే నుంచి ఢిల్లీకి ఫ్లైట్‌

  • మ‌రికాసేప‌ట్లో 246 మందితో ల్యాండింగ్
  • కొత్త వైర‌స్ భ‌యాల న‌డుమే స‌ర్వీసులు ప్రారంభం‌

న్యూఢిల్లీ: యూకేలో విస్తరిస్తున్న‌ కరోనా న్యూ స్ట్రెయిన్ నేపథ్యంలో భారత్-యూకే మధ్య రద్దైన విమానాలు.. వైర‌స్ ప్ర‌భావం ఏ మాత్రం త‌గ్గ‌క‌ముందే తిరిగి ప్రారంభమ‌య్యాయి. భార‌త్ నుంచి యూకేకు విమానాల‌ను ఈ నెల 6న ప్రారంభించ‌గా, ఇవాళ యూకే నుంచి భార‌త్‌కు  విమానాల రాక మొద‌లైంది. ఈ నెల 6న ఢిల్లీ నుంచి ఒక‌టి, ముంబై నుంచి ఒక‌టి రెండు ఎయిర్ ఇండియా విమానాలు లండ‌న్‌కు వెళ్లాయి. ఇవాళ‌ 246 మంది ప్రయాణికుల‌తో ఎయిర్ ఇండియా విమానం యూకే నుంచి భార‌త్‌కు బ‌య‌లుదేరింది. మ‌రికాసేప‌ట్లో ఆ విమానం ఢిల్లీ విమానాశ్ర‌యంలో ల్యాండ్ కానుంది.  

అయితే భార‌త్‌-యూకే మ‌ధ్య విమానాల రాక‌పోక‌లు ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ విమానాల ఫ్రీక్వెన్సీ మాత్రం మునుప‌టిలా ఉండ‌ద‌ని, మొత్తం 70 విమానాల‌కుగాను జ‌న‌వ‌రి 23 దాకా 30 స‌ర్వీసులు మాత్ర‌మే రాక‌పోక‌లు సాగిస్తాయ‌ని పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్దీప్‌సింగ్ పురి ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఆ 30 విమానాల్లో 15 భార‌త్‌కు చెందినవి, 15 యూకేకు చెందిన‌వి ఉంటాయ‌ని తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo