సోమవారం 01 జూన్ 2020
National - May 08, 2020 , 17:42:07

షార్జా నుంచి 2 వందల మందితో బయల్దేరిన విమానం

షార్జా నుంచి 2 వందల మందితో బయల్దేరిన విమానం

లక్నో: లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా యూఏఈలో చిక్కుకుపోయిన సుమారు రెండు వందల మంది భారతీయులతో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం షార్జా నుంచి బయల్దేరింది. ఇది శనివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని చౌధరి చరణ్‌సింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనుంది. 

విదేశాల్లో ఇరుక్కుపోయిన సుమారు 15 వేల భారతీయులను 64 విమానాల్లో మే 7 నుంచి 13 వరకు తరలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 64 విమానాలను ఎయిర్‌ ఇండియా నడపనుందని వెల్లడించింది. 


logo