బుధవారం 08 జూలై 2020
National - Jun 27, 2020 , 14:50:31

ఉక్రెయిన్‌ నుంచి ఛండీగఢ్‌ చేరుకున్న భారతీయులు

ఉక్రెయిన్‌ నుంచి ఛండీగఢ్‌ చేరుకున్న భారతీయులు

ఛండీగఢ్‌: కరోనా నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి క్షేమంగా చేరుకున్నారు. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన ‘వందేభారత్‌ మిషన్‌’ మూడో ఫేస్‌లో భాగంగా ఎయిర్‌ ఇండియా విమానం (ఏఎల్‌1928)ను ఉక్రెయిన్‌ పంపించారు. ఇందులో 144 మంది భారతీయులను ఉక్రెయిన్‌లోని బోర్సిపోల్‌ నుంచి ఢిల్లీ మీదుగా ఛండీగఢ్‌కు తరలించారు. వీరంతా శనివారం ఉదయం 12.50 గంటలకు ల్యాండ్‌ అయినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఎక్కువ మంది పంజాబ్‌, పక్క రాష్ట్రాలవారే ఉన్నారని తెలిపారు. వీరందరినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆయా జిల్లాలకు తరలించి, కేంద్ర సర్కారు మార్గదర్శకాలకు అనుగుణంగా క్వారంటైన్‌ చేసినట్లు వివరించారు. 

కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర సర్కారు మే 7న వందేభారత్‌ మిషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం మూడో ఫేస్‌ నడుస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 2,50,087 మందిని స్వదేశానికి తీసుకువచ్చారు. logo