శనివారం 11 జూలై 2020
National - Jun 20, 2020 , 01:35:57

లెహ్‌, శ్రీనగర్‌ స్థావరాలను పరిశీలించిన భదౌరియా

లెహ్‌, శ్రీనగర్‌ స్థావరాలను పరిశీలించిన భదౌరియా

న్యూఢిల్లీ, జూన్‌ 19: జమ్ముకశ్మీర్‌లోని లెహ్‌, శ్రీనగర్‌ వైమానిక స్థావరాలను భారత వైమానిక దళం అధిపతి భదౌరియా సందర్శించారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఆయన వీటిని పరిశీలించారు. సరిహద్దులోని గల్వాన్‌ లోయ వద్ద ఇటీవల భారత్‌, చైనా బలగాల ఘర్షణ నేపథ్యంలో ఆయన ఈ స్థావరాలను సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు సరిహద్దు వద్దకు సుఖోయ్‌-30ఎంకేఐ, మిరాజ్‌ 2000, జాగ్వర్‌ యుద్ధ విమానాలను వైమానిక దళం తరలించినట్లు తెలుస్తున్నది. అలాగే లడఖ్‌ సెక్టార్‌కు అమెరికాలో తయారైన అపాచీ హెలికాప్టర్లను తరలించినట్లు సమాచారం.


logo