సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 21, 2020 , 12:43:30

క‌ర్బన ఉద్గారాల‌‌ను 35 శాతం త‌గ్గిస్తాం: ప‌్ర‌ధాని మోదీ

క‌ర్బన ఉద్గారాల‌‌ను 35 శాతం త‌గ్గిస్తాం: ప‌్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్ భార‌త్‌లో క‌ర్బ‌న్ ఉద్గారాల విడుద‌ల‌ను 30 నుంచి 35 శాతానికి త‌గ్గించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్లు ప్ర‌ధాని మోదీ అన్నారు.  పండిట్ దీన్‌ద‌యాళ్ పెట్రోలియం యూనివ‌ర్సిటీ కాన్వ‌కేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న వ‌ర్చువ‌ల్ సందేశం చేశారు.  క‌ర్బ‌న్ ఉద్గారాల‌ను 35 శాతానికి త‌గ్గించాల‌ని ల‌క్ష్యం పెట్టుకున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు.  ఈ నేప‌థ్యంలో స‌హజ ఇంధ‌న వినియోగాన్ని ఈ ద‌శాబ్ధంలో నాలుగు రెట్లు పెంచేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు చెప్పారు. ప్ర‌పంచం అంతా కోవిడ్ మ‌హ‌మ్మారితో మారిపోయిన త‌రుణంలో మీరంతా ఇంధ‌న‌రంగ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెడుతున్నార‌ని, ఈ ద‌శ‌లో పారిశ్రామికుల‌కు, ఉద్యోగుల‌కు మంచి అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. మ‌నిషిలో బాధ్య‌త‌.. అత‌ని వ్య‌క్తిగ‌త జీవితంలో అవ‌కాశాల‌ను పెంచుతుంద‌ని, అయితే జీవితాన్ని క‌ష్టంగా భావించేవాళ్లు విఫ‌లం అవుతుంటార‌ని ప్ర‌ధాని తెలిపారు. 21వ శ‌తాబ్ధానికి చెందిన యువ‌త‌.. స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యం, స్ప‌ష్ట‌మైన మ‌న‌సుతో ముందుకు వెళ్లాల‌న్నారు.