సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 17:11:15

పాజిటివ్ రేటును త‌గ్గించేందుకు జోరుగా టెస్టింగ్

పాజిటివ్ రేటును త‌గ్గించేందుకు జోరుగా టెస్టింగ్

హైద‌రాబాద్‌: కేంద్ర ఆరోగ్య‌శాఖ అధికారులు ఇవాళ క‌రోనా వైర‌స్ అప్‌డేట్స్ ఇచ్చారు. ఆరోగ్య‌శాఖ ఓఎస్‌డీ రాజేశ్‌భూష‌ణ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌పంచ‌దేశాల‌తో పోలిస్తే భార‌త్‌లో మ‌ర‌ణాల రేటు త‌క్కువ‌గా ఉన్న‌ట్లు చెప్పారు. కోవిడ్‌19 పాజిటివ్ రేటును క‌నిష్ట స్థాయికి తీసుకువ‌చ్చేందుకు విస్తృత స్థాయిలో టెస్టింగ్ నిర్వహించాల్సి ఉంద‌న్నారు. పాజిటివ్ రేటును 5 శాతం లోపు ఉంచేందుకు ఇదే స్థాయిలో టెస్టింగ్ ప్ర‌క్రియ అవ‌స‌ర‌మ‌ని ఓఎస్‌డీ రాజేశ్ భూష‌ణ్ తెలిపారు. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్ర‌తి రోజు స‌గ‌ట‌ను మిలియ‌న్ జ‌నాభాకు 140 ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. భార‌త దేశ స‌గ‌టు క‌న్నా.. 30 రాష్ట్రాలు, యూటీల్లో వైర‌స్ పాజిటివ్ రేటు త‌క్కువ‌గా ఉంద‌న్నారు.  

ఢిల్లీలో సీరో నిఘా ద్వారా పాజిటివ్ కేసుల సంఖ్య‌ను అంచ‌నా వేశామ‌ని, కోవిడ్‌19 సంక్ర‌మ‌ణ రేటు ఎలా ఉందో తెలుసుకునేందుకు సీరో నిఘా చేసిన‌ట్లు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్‌(ఎన్‌సీడీసీ) డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ సుజీత్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే వైర‌స్ ప్ర‌బ‌లి ఆర్నెళ్లు గ‌డుస్తున్న నేప‌థ్యంలో.. ఢిల్లీలో 22.86 శాతం మందికి వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు గుర్తించామ‌ని ఆయ‌న తెలిపారు. మ‌రో 77 శాతం మందికి వైర‌స్ సోకే ప్ర‌మాదం కూడా ఉంద‌న్నారు.    

భార‌త్‌లో జ‌రుగుతున్న రెండు కోవిడ్ వ్యాక్సిన్ ప‌రీక్ష‌లు మొద‌టి, రెండ‌వ ద‌శ‌లో ఉన్నాయ‌ని, అయితే అవ‌స‌ర‌మైన వారికి ఎలా ఆ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాల‌న్న అంశంపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు నీతి ఆయోగ్ స‌భ్యుడు డాక్ట‌ర్ వీకే పాల్ తెలిపారు. 


logo