శనివారం 06 జూన్ 2020
National - May 13, 2020 , 10:11:10

ఎయిమ్స్ పేషెంట్ల‌కు వైద్య ఖ‌ర్చులు మాఫీ

ఎయిమ్స్ పేషెంట్ల‌కు వైద్య ఖ‌ర్చులు మాఫీ

హైద‌రాబాద్‌: క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందిన పేషెంట్ల‌కు భారీ ఊర‌ట కల్పించింది.  రోగుల‌కు వైద్య చికిత్స ఖ‌ర్చుల‌ను మాఫీ చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.  జ‌న‌ర‌ల్ వార్డుల్లో అడ్మిష‌న్ ఫీజు, మెడిక‌ల్ ఇన్వెస్టిగేష‌న్ కోసం అయ్యే ఖ‌ర్చుల‌ను మాఫీ చేస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది.  ఆయుస్మాన్ భార‌త్ ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న కింద ల‌బ్ధిదారుల‌కు ఈ అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. రిఫ‌రెన్స్ ద్వారా వ‌చ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన వారికి కూడా అడ్మిష‌న్ ఛార్జీలు ఉండ‌వు. అయితే సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొనే వర‌కు ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్నారు.  ఆయుస్మాన్ భార‌త్ ప్ర‌కారం ఈ ఆదేశాలు జారీ చేశారు.మార్చి 24వ తేదీ నుంచి తొలిసారి ఎయిమ్స్ ద‌వాఖానా ఓపీడీ సేవ‌ల‌ను నిలిపివేసింది. కేవ‌లం ఎమ‌ర్జెన్సీ స‌ర్జ‌రీలు మాత్ర‌మే చేయాల‌ని మ‌రో స‌ర్క్యూల‌ర్‌లో ఆదేశించింది.   


logo