శనివారం 30 మే 2020
National - May 11, 2020 , 09:20:01

నిల‌క‌డ‌గానే మ‌న్మోహన్‌సింగ్ ఆరోగ్యం

నిల‌క‌డ‌గానే మ‌న్మోహన్‌సింగ్ ఆరోగ్యం

న్యూఢిల్లీ: ‌మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే స్వ‌ల్పంగా జ్వ‌రం ఉన్న‌ద‌ని, ఛాతీనొప్పి త‌గ్గ‌డానికి ఇచ్చిన‌ ఔషధాలవ‌ల్ల జ్వ‌రం వ‌చ్చి ఉంటుంద‌ని వైద్యులు తెలిపిన‌ట్లు స‌మాచారం. జ్వ‌రానికి ఇత‌ర కార‌ణాలేమైనా ఉన్నాయో తెలుసుకునేందుకు అన్ని ర‌కాల వైద్య‌ ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించిన‌ట్లు తెలిసింది. ఛాతీలో నొప్పి రావ‌డంతో మ‌న్మోహన్‌సింగ్ ఆదివారం సాయంత్రం ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో చేరారు. కాగా, మ‌న్మోహ‌న్‌సింగ్‌కు 2009లో బైపాస్ స‌ర్జ‌రీ జ‌రిగింది. 2004 నుంచి 2014 వ‌ర‌కు రెండు ప‌ర్యాయాలు దేశ ప్ర‌ధానిగా ప‌నిచేసిన మ‌న్మోహ‌న్‌.. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ‌ 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo