బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 11:27:53

వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా.. కొత్త రక్షణ కవచం

వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా.. కొత్త రక్షణ కవచం

జైపూర్: కరోనా నేపథ్యంలో డాక్లర్లు, వైద్య సిబ్బందికి వైరస్ సోకకుండా ఉండేందుకు ఎయిమ్స్ జోధ్‌పూర్, ఇస్కాన్ సర్జికల్స్ లిమిటెడ్ కలిసి ఒక కొత్త రక్షణ కవచాన్ని తయారు చేశాయి. ఒక పెట్టె మాదిరిగా ఉండే దీనికి అభే‌ద్యా అని పేరు పెట్టాయి. ఈ పరికరాన్ని మంగళవారం ఆవిష్కరించాయి.

రోగులకు అనస్థీషియా ఇచ్చేటప్పుడు లేదా వారి నుంచి స్రవాలను బయటకు తీసేటప్పుడు డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఎయిమ్స్ జోధ్‌పూర్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ మిశ్రా తెలిపారు. పెట్టె మాదిరిగా ఉండే దీనిలో అనేక పరికరాలు ఉంటాయని, రోగులను అందులో ఉంచితే ఆయా విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి వైరస్ వంటివి సోకకుండా రక్షణ కల్పిస్తుందని ఆయన చెప్పారు.




logo