సోమవారం 25 మే 2020
National - Apr 06, 2020 , 18:47:45

కరోనాపై యుద్ధం.. కన్నీరు పెట్టుకున్న డాక్టర్‌.. వీడియో

కరోనాపై యుద్ధం.. కన్నీరు పెట్టుకున్న డాక్టర్‌.. వీడియో

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను దేశం నుంచి తరిమికొట్టేందుకు డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు విశ్రాంతి లేకుండా పోరాటం చేస్తున్నారు. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కరోనాపై యుద్ధం చేస్తున్నారు డాక్టర్లు, నర్సులు. కరోనా పేషెంట్లను ప్రాణాలతో బతికించేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు వైద్యులు. 

ఈ విపత్కర పరిస్థితుల్లో ఢిల్లీ ఎయిమ్స్‌లోని కొవిడ్‌-19 ఐసోలేషన్‌ వార్డులో పని చేస్తున్న వైద్యురాలు డాక్టర్‌ అంబికాను మీడియా పలుకరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొవిడ్‌-19కు వ్యతిరేక పోరాటం ఓ యుద్ధం లాంటింది. ఐసోలేషన్‌ వార్డులో పని చేస్తున్నప్పుడు తమకు తెలియకుండానే రోమాలు నిక్కపొడుస్తాయి. ఈ వార్డుల్లో పని చేస్తున్న తమకు లేదా తమ నుంచి కుటుంబ సభ్యులకు కరోనా సోకితే ఏంటి పరిస్థితి అని భయమేస్తుంది. ఒక వేళ జరగరానిది జరిగితే.. తమ కుటుంబ సభ్యులు కూడా తమను చూడటానికి రారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తాము పని చేస్తున్నాం అని అంబికా చెబుతూ.. కన్నీరు పెట్టుకున్నారు.


logo