e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home జాతీయం శ‌శిక‌ళ‌తో మాట్లాడితే పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌.. ఏఐఏడీఎంకే తీర్మానం

శ‌శిక‌ళ‌తో మాట్లాడితే పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌.. ఏఐఏడీఎంకే తీర్మానం

శ‌శిక‌ళ‌తో మాట్లాడితే పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌.. ఏఐఏడీఎంకే తీర్మానం

చెన్నై: శ‌శిక‌ళ‌తో మాట్లాడే వారిని పార్టీ నుంచి బ‌హ‌ష్క‌రిస్తామ‌ని త‌మిళ‌నాడుకు చెందిన ఏఐఏడీఎంకే త‌మ నేత‌ల‌ను హెచ్చ‌రించింది. సోమ‌వారం జ‌రిగిన పార్టీ స‌మావేశంలో ఈ మేర‌కు ఒక తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టి ఏక‌గ్రీవంగా ఆమోదించింది. తాను త్వ‌ర‌లోనే క్రీయాశీల రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని, అన్నాడీఎంకేపై ప‌ట్టుసాధిస్తాన‌ని ఆ పార్టీకి చెందిన కొంద‌రు నేత‌ల‌తో వీకే శ‌శిక‌ళ ఇటీవ‌ల మాట్లాడిన ఒక ఆడియో క్లిప్ బ‌య‌ట‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో అన్నాడీఎంకే కీల‌క నిర్ణ‌యం తీసుకున్నది. శ‌శిక‌ళ‌తో మాట్లాడే వారిని పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తామ‌ని నేత‌ల‌ను హెచ్చ‌రించింది. పార్టీకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించేవారిపై క్ర‌మ‌శిక్ష‌ణ కింద చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొంది. సోమ‌వారం జ‌రిగిన పార్టీ స‌మావేశంలో ఈ మేర‌కు ఒక తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టి ఆమోదించింది. అనంత‌రం శ‌శిక‌ళ‌తో ఇటీవ‌ల‌ మాట్లాడిన 16 మంది పార్టీ కార్యకర్తలను అన్నాడీఎంకే బహిష్కరించింది. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప‌డిన పార్టీ ప్రతినిధి వీ పుగజేండిని కూడా బహిష్కరించింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement