చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే నేత ఒకరు ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియో బయటపడింది. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. చెపాక్ నియోజకవర్గంలో ఆ నేత ఓటర్లకు రూ.500 నోట్లు పంచుతూ కనిపించారు. ఈ నియోజకవర్గం నుంచి డీఎంకే పార్టీ ఉదయనిధి స్టాలిన్ను పోటీలో ఉన్నారు. అయితే ఈ అంశంపై ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించనున్నారు. ఐడీ కార్డులను పరిశీలించి, ఆ తర్వాత అన్నాడీఎంకే నేత ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు గుర్తించారు. గత బుధవారం ఎన్నికల సంఘానికి చెందిన ఫ్లయిండ్ స్క్వాడ్.. శ్రీవిల్లుపుత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆకస్మిక దాడి చేసి 3.21 కోట్లు సీజ్ చేసింది. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ ఆరవ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.