మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 12:46:44

అసెంబ్లీ నుంచి ఏఐఏడీఎంకే, బీజేపీ ఎమ్మెల్యేల వాకౌట్

అసెంబ్లీ నుంచి ఏఐఏడీఎంకే, బీజేపీ ఎమ్మెల్యేల వాకౌట్

పుదుచ్చేరి: పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించాల్సిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అసెంబ్లీకి హాజరుకాలేదు. దీంతో ఏఐఏడీఎంకే, బీజేపీ ఎమ్మెల్యేలు దీనిపై నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల నుంచి వారు వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి స్పీకర్ వీపీ శివకోలుందు సభను పది నిమిషాలపాటు వాయిదా వేశారు.

మరోవైపు అసెంబ్లీ సమావేశాల ప్రారంభ ప్రసంగం గురించి ప్రభుత్వం నుంచి సోమవారం తెల్లవారుజామున 3.30కి లేఖ అందిందని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశానికి మరో తేదీని ఖరారు చేయాలంటూ సీఎం నారాయణ స్వామికి లేఖ రాశారు.

అయితే సోమవారమే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థిక శాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి  నారాయణస్వామి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. సాధారణంగా మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు జరుగాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డాయి. దీంతో అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆలస్యమైంది. 

logo