మెట్రోరైల్ ప్రాజెక్టులకు ప్రధాని భూమిపూజ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సోమవారం గుజరాత్‌లోని రెండు వేర్వేరు మెట్రో రైల్ ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు. అహ్మదాబాద్‌లోని మెట్రోరైల్ ప్రాజెక్టు ఫేజ్-2కు, సూరత్ మెట్రోరైల్ ప్రాజెక్టుకు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. దేశంలోని రెండు ప్రధాన వ్యాపార కేంద్రాలైన అహ్మదాబాద్, సూరత్‌లలో తాజా మెట్రోరైల్ ప్రాజెక్టుల ద్వారా కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
అహ్మదాబాద్, సూరత్‌లకు ఈ నూతన మెట్రోరైల్ ప్రాజెక్టులు చాలా ముఖ్యమైన బహుమతులని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. మెట్రోరైల్ ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వాలకు ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య చాలాతేడా ఉన్నదని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం దేశవ్యాప్తంగా మెట్రోలైన్లను విస్తరించిందని తెలిపారు. 2014కు ముందు దేశంలో కేవలం 225 కిలోమీటర్ల మెట్రోలైన్ మాత్రమే ఉండేదని, అయితే ఈ ఆరేండ్లలోనే మరో 450 కిలోమీటర్ల మెట్రోలైన్ అందుబాటులోకి చ్చిందని ప్రధాని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.