మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 03, 2020 , 16:13:11

ట్రంప్ గెలుపు కోసం హిందూసేన ప్ర‌త్యేక పూజ‌లు

ట్రంప్ గెలుపు కోసం హిందూసేన ప్ర‌త్యేక పూజ‌లు

న్యూఢిల్లీ : అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లకు ఓటింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. అయితే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం హిందూసేన ఢిల్లీలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించింది. ఈస్ట్ ఢిల్లీలోని ఓ ఆల‌యంలో నిర్వ‌హించిన ఈ ప్ర‌త్యేక పూజ‌ల్లో హిందూసేన కార్య‌క‌ర్త‌లు, ట్రంప్ మ‌ద్ద‌తుదారులు పాల్గొన్నారు. 30 నిమిషాల పాటు ప్ర‌త్యేక పూజ‌ల‌తో పాటు, హోమం నిర్వ‌హించిన హిందూసేన కార్య‌క‌ర్త‌లు.. ఈ ఎన్నిక‌ల్లో ట్రంప్ భారీ విజ‌యం సాధించాల‌ని ప్రార్థించారు. 

ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజలు చేసిన పూజారి వేద్ శాస్ర్తి మాట్లాడుతూ.. ఇస్లామిక్ రాడిక‌ల్స్‌కు వ్య‌తిరేకంగా ట్రంప్ గ‌ళం విప్పార‌ని తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో ట్రంప్‌కు ప్ర‌పంచ దేశాలు మ‌ద్ద‌తు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.  

హిందూసేన అధ్య‌క్షుడు విష్ణు గుప్తా మాట్లాడుతూ.. గ‌త ఎన్నిక‌ల్లో కూడా ట్రంప్ గెల‌వాల‌ని కోరుతూ ప్ర‌త్యేక పూజ‌లు చేశామ‌న్నారు. ఈసారి కూడా అదేవిధంగా పూజ‌లు నిర్వ‌హించామ‌ని తెలిపారు. ట్రంప్ గెలుపు ప్ర‌పంచానికే కాదు.. భార‌త్‌కు కూడా మంచిదే అని అన్నారు. ఎందుకంటే అమెరికా మ‌న‌కు మిత్ర దేశమ‌ని చెప్పారు. పాకిస్తాన్‌, చైనాకు వ్య‌తిరేకంగా అమెరికా ఉంద‌ని  గుప్తా పేర్కొన్నారు.  

కొన్నేండ్ల క్రితం ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద హిందూసేన.. ట్రంప్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను నిర్వ‌హించి కేక్ క‌ట్ చేసింది.