గురువారం 09 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 02:59:17

గుజరాత్‌ పేదలకు ‘ట్రంప్‌ పర్యటన’ కష్టాలు

గుజరాత్‌ పేదలకు  ‘ట్రంప్‌ పర్యటన’ కష్టాలు
  • ఆక్రమిత స్థలాలు ఖాళీ చేయాలంటూ అహ్మదాబాద్‌ అధికారుల నోటీసులు

అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గుజరాత్‌ పర్యటన అక్కడి మురికివాడలపై ప్రభావం చూపుతున్నది. అహ్మదాబాద్‌లో నిర్మించిన మొతెరా స్టేడియాన్ని ఈ నెల 24న ప్రధాని మోదీతో కలిసి ట్రంప్‌ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలోని మురికివాడ నివాసితులను ఖాళీ చేయించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈమేరకు సుమారు 45 కుటుంబాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే పదేండ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, ఉన్నపళంగా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లేదంటూ మురికివాడ ప్రజలు వాపోతున్నారు. ఆక్రమణదారులను ఖాళీ చేయించే ప్రణాళికలో భాగంగానే నోటీసులు ఇచ్చామని, ట్రంప్‌ పర్యటనకు దీనికి ఎలాంటి సంబంధం లేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు, ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో అహ్మదాబాద్‌లో పేదల ప్రాంతాలు కనిపించకుండా భారీ ఎత్తున పొడవైన గోడ నిర్మించడంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. గోడలతో పేదరికాన్ని దాచలేరని ఎద్దేవా చేసింది. ప్రజల వినియోగ స్థాయిలు 40 ఏండ్ల కనిష్ఠానికి దిగజారాయని ఆందోళన వ్యక్తం చేసింది. 


logo