శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 12:47:18

చైనా రాఖీలకు భారీగా తగ్గిన డిమాండ్‌

 చైనా రాఖీలకు భారీగా తగ్గిన డిమాండ్‌

న్యూఢిల్లీ:   అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ప్రతి ఏడాది జరుపుకునే రాఖీ పండుగ వచ్చేస్తున్నది.  రక్షాబంధన్‌(రాఖీ) పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సందడి నెలకొంటుంది.  ఈ ఏడాది రక్షాబంధన్‌ పండుగకు ముందు  చైనా రాఖీలకు డిమాండ్‌ తగ్గిందని   దేశంలోని పలు ప్రాంతాల దుకాణదారులు తెలిపారు. సరిహద్దులో భారత్‌, చైనా ఉద్రిక్తతల కారణంగా ప్రజలు చైనా రాఖీలు కొనడానికి  నిరాకరిస్తున్నారు.

చాలా మంది  మహిళలు   చైనా రాఖీల కంటే భారత్‌లో తయారు చేసిన రాఖీలను ఇష్టపడుతున్నారు.  స్థానికంగా తయారైన రాఖీలను కొనుగోలు చేయడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు మేలుచేసినట్లు అవుతుందని వారు భావిస్తున్నారు. 

'ఎన్నోఏండ్లుగా చైనా రాఖీలను కొంటున్నాను.  ఈ ఏడాది నేను భారత్‌లో తయారైన రాఖీని కొనుగోలు చేస్తాను.   మనకు  ముప్పుగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను మనమెందుకు పెంచాలి?  మన సైనిక సోదరులపై దాడి చేస్తుంటే,  చైనాలో తయారైన రాఖీలను నా సోదరులను ఎందుకు కట్టాలని' షిమ్లాకు చెందిన కస్టమర్‌ అంచల్‌‌ తెలిపారు.  'చైనా రాఖీలను వినియోగదారులు తిరస్కరిస్తున్నారు. రాఖీ కొనేముందే అది ఎక్కడ తయారైందో ఆరా తీస్తున్నారు. స్థానికంగా తయారు చేసిన  రాఖీలతో మనదేశానికి లాభం ఉంటుందని' దుకాణ యజమాని పేర్కొన్నారు. 


logo