కాంగ్రెస్‌లో చేరనున్న శరద్‌యాదవ్ తనయ

న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు లోక్తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ) చీఫ్ శరద్‌యాదవ్ కుమార్తె సుభాషిని రాజ్‌రావు బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. రాబోయే బిహార్ ఎన్నికల్లో ఆమె సైతం పోటీ చేయనున్నారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకత్వంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలో ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు. ఉపేంద్ర కుష్వాహా ఆర్ఎల్ఎస్పీ కూటమి నుంచి వైదొలిగి బీఎస్పీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. హిందూస్తాన్ అవాం మోర్చా (హెచ్ఏఎం) చీఫ్ జితాన్ రామ్ మంజీ ఎన్డీఏ కూటమిలో చేరారు. ఎన్డీఏ కూటమి కూటమి నుంచి ఈ సారి లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) పోటీ చేయడం లేదు. సీట్ల పంపకం, ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ సారి ఆ పార్టీ అధికార జనతాదళ్ (యునైటెడ్)పై పోరాడనుంది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ మూడు దశల్లో ఎన్నికలకు జరుగనున్న విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కల్నల్ సంతోష్‌కు మహావీర చక్ర
- మేక పిల్లను రక్షించబోయి యువకుడు మృతి
- తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం
- మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు
- రాజస్థాన్‌లో పెట్రోల్ భగభగ.. లీటర్ @ రూ.100
- పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- అభిమాని పెళ్లిలో సూర్య..ఆనందంలో వధూవరులు..!
- పదవులు శాశ్వతం కాదు.. చేసిన మంచే శాశ్వతం
- దుస్తులుండి అసభ్యంగా ప్రవర్తిస్తే లైంగిక వేధింపు కాదు
- చైతన్య చేసిన పనికి ఏడ్చేసిన నిహారిక..వీడియో