పారిస్: అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ జపాన్ ప్లేయర్ నవోమీ ఒసాకాకు మద్దతు ప్రకటించింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లను బాయ్‌కాట్ చేయడం వల్ల తనకు జరిమానా విధించడంపై నిరసన వ్యక్తం చేసిన నవోమీ.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీనిపై సోమవారం తన తొలి రౌండ్ మ్యాచ్ ముగిసిన తర్వాత సెరెనా స్పందించింది.
ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చే ముందే నాకు ఈ విషయం తెలిసింది. ఆమెకు ఓ హగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎలాంటి పరిస్థితో నాకు తెలుసు. నేను కూడా గతంలో ఇలాంటివి అనుభవించాను అని సెరెనా చెప్పింది. పరిస్థితులను ఒక్కొక్కరు ఒక్కోలా ఎదుర్కొంటారు. అందరూ ఒకేలా స్పందించాలని లేదు. ఈ పరిస్థితిని ఆమె ఎలా హ్యాండిల్ చేస్తోందో అలానే చేయనివ్వండి అని సెరెనా స్పష్టం చేసింది.