ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 04:15:06

వ్యవసాయాన్ని ఉత్పత్తిరంగంగా మార్చాలి

వ్యవసాయాన్ని ఉత్పత్తిరంగంగా మార్చాలి

  • వ్యవసాయ ఇంజినీరింగ్‌ పట్టభద్రులు గ్రామాలకు తరలాలి
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యవసాయ ఇంజినీరింగ్‌ పట్టభద్రులు గ్రామాలకు వెళ్లి యంత్రాల సాయంతో సాగు చేయాలని, వ్యవసాయాన్ని ఉత్పత్తిరంగంగా మార్చాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ‘ఇంజినీరింగ్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌' అంశంపై జరిగిన వెబ్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వ్యవసాయాన్ని ఉత్పత్తిరంగంగా మార్చాలని పట్టభద్రులను కోరారు. వ్యవసాయరంగంలో ఆధునిక, సాంకేతిక యంత్రాలు వినియోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో చిన్న కమతాలే ఎక్కువగా ఉన్నాయని, తక్కువ భూమి కలిగిన రైతులు యంత్రాలు ఉపయోగించడం సాధ్యంకాదన్నారు. వ్యవసాయ ఇంజినీరింగ్‌ పట్టభద్రులు గ్రామాలకు వెళ్లి యంత్రాలను లీజుకు తీసుకోవాలని, భూమిని దున్నడం, నాట్లు, విత్తనాలు వేయడం, పంట ఉత్పత్తులు మార్కెటింగ్‌ చేయడం ద్వారా మెరుగైన లాభాలను ఆర్జించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో నాబార్డ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వై కృష్ణారావు, ఆగ్రోస్‌ కార్పొరేషన్‌ ఎండీ రాములు, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా రాష్ట్ర చైర్మన్‌ జీ రామేశ్వర్‌రావు, కార్యదర్శి అంజయ్య, కన్వీనర్‌ శంకర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. logo