మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 29, 2020 , 10:58:59

కొవిడ్‌ టెస్ట్‌ కిట్‌ను రూపొందించిన ‘అగప్పే’

కొవిడ్‌ టెస్ట్‌ కిట్‌ను రూపొందించిన ‘అగప్పే’

తిరువనంతపురం : కొచ్చికి చెందిన వైద్య పరికరాల సంస్థ అగప్పే డయాగ్నోస్టిక్స్ కొవిడ్‌-19 టెస్ట్‌ కిట్‌ను తయారు చేసింది. వేగంగా.. ఖచ్చితమైన ఫలితాలు ఇస్తున్నాయని సంస్థ పేర్కొంది. దీన్ని నవంబర్ 10న కిట్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. కొత్త కొవిడ్‌ టెస్ట్‌ కిట్‌ రియాజెంట్స్‌ మిస్పా లూమ్, లుమెస్క్రీన్-ఎన్‌ కోవ్‌-2 బ్రాండ్ పేరుతో కొచ్చిలోని ఓ కంపెనీ ఉత్పత్తి చేయనుంది. ‘మిస్పా లూమ్‌ రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ లూప్-మెడియేటెడ్ ఐసోథర్మల్ యాంప్లిఫికేషన్ (RT-LAMP) టెక్నాలజీపై ఆధారపడి పని చేయనుంది. ఇది పాలిమరేస్‌ చైన్ రియాక్షన్ (పీసీఆర్‌) పరీక్ష నుంచి గణనీయమైన మెరుగుదల ఉంటుందని, ఎందుకంటే ఇది మరింత చౌక, వేగవంతమైందని అగప్పే మేనేజింగ్ డైరెక్టర్ థామస్ జాన్ తెలిపారు. గ్రామీణ భారతదేశంలో పరీక్ష రేటును పెంచుతుందన్న ఆశతో ఉత్పత్తిని ప్రారంభిస్తున్నామని, ఖర్చు ఆర్టీ-పీసీఆర్ పరికరాల్లో నాలుగింట ఒక వంతేనని, టెస్ట్‌ కిట్‌ ధర 30 నుంచి 40 శాతం తక్కువ అని ఆయన తెలిపారు. మరో ప్రయోజనం ఏమిటంటే, రియాజెంట్‌ను 20 డిగ్రీల సెల్సియస్ వద్ద రవాణా చేయవచ్చని చెప్పారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌), సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్ట్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నుంచి అనుమతి లభించినట్లు పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.