సోమవారం 13 జూలై 2020
National - Jun 28, 2020 , 01:03:50

మళ్లీ మిడుతల దండుయాత్ర

మళ్లీ మిడుతల దండుయాత్ర

  • గురుగ్రామ్‌తోపాటు ఢిల్లీ సరిహద్దుల్లోకి ప్రవేశం

న్యూఢిల్లీ: దేశంలో మిడుతల దండుయాత్ర మళ్లీ ఆందోళన రేకెత్తిస్తున్నది. శనివారం హర్యానాలోని గురుగ్రామ్‌తోపాటు దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాలను పెద్ద ఎత్తున మిడుతలు చుట్టుముట్టాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో దాదాపు ఆరు జిల్లాల్లో పంటలను నాశనం చేశాయి. దీంతో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. మిడుతల నియంత్రణ ఆపరేషన్‌ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాజస్థాన్‌ నుంచి పలు బృందాలను హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌కు తరలించింది. గత ఏడాదిన్నర కాలంగా పాకిస్థాన్‌ నుంచి పెద్ద ఎత్తున మిడుతలు సరిహద్దున ఉన్న రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తున్నాయి. అక్కడి నుంచి వివిధ రాష్ర్టాల్లోకి అడుగుపెడుతూ మార్గమధ్యంలో పెద్ద ఎత్తున పంటలను నాశనం చేస్తున్నాయి. మిడుతలను నిర్మూలించడానికి హెలికాప్టర్లను వినియోగించాలని రాజస్థాన్‌ ప్రభుత్వం శనివారం కేంద్రానికి లేఖ రాసింది. 


logo