మంగళవారం 26 మే 2020
National - May 15, 2020 , 10:50:15

కొవిడ్‌తో పోరాడి గెలిచి.. పండంటి బిడ్డకు జన్మ

కొవిడ్‌తో పోరాడి గెలిచి.. పండంటి బిడ్డకు జన్మ

న్యూఢిల్లీ : ఓ మహిళ కొవిడ్‌-19తో పోరాడి గెలిచి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఢిల్లీలోని జహంగీర్‌పూరి పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ దేవేందర్‌కు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయన భార్యకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు కూడా పాజిటివ్‌ అని తేలింది. కరోనా సోకిన సమయంలో పోలీసు భార్య నిండు గర్భిణి. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరినీ ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందించారు. మొత్తానికి ఈ ఇద్దరు కరోనాతో పోరాడి గెలిచారు. భార్యాభర్తలిద్దరికీ కరోనా నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఐసోలేషన్‌ వార్డు నుంచి డిశ్చార్జి అయిన గర్భిణి.. మే 8వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 


logo