బుధవారం 27 మే 2020
National - May 06, 2020 , 20:19:26

నెల తర్వాత ఇంటి ముఖం చూసిన నర్సు

నెల తర్వాత ఇంటి ముఖం చూసిన నర్సు

నాగ్‌పూర్‌: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ పట్టణానికి చెందిన రాధిక వించుర్‌కార్‌ అనే నర్సు నెల రోజుల తర్వాత ఇంటిముఖం చూసింది. నెల రోజులుగా నాగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో కరోనా బాధితులకు ఆమె సేవలందించారు. కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడం చాలా కష్టమైన పని అని ఆమె చెప్పారు. పీపీఈ కిట్స్‌ ధరిస్తే ఒంటికి నొప్పిగా ఉంటుందన్నారు. దానికి తోడు పేషెంట్లలో చాలామంది తమను అనవసరంగా ఆస్పత్రిలో ఉంచుతున్నారనే భావంతో ఉంటారని, అందుకే వారు తరచూ తమతో గొడవలు పడుతారని వించుర్‌కార్‌ చెప్పారు. మొత్తానికి సాధారణ రోగులకు సేవలందించడం వేరు, కరోనా బాధితులకు సేవలు అందించడం వేరని ఆమె అభిప్రాయం తెలిపారు. 


logo