బుధవారం 03 జూన్ 2020
National - Apr 10, 2020 , 17:40:23

లాక్‌డౌన్‌ను మే 1 వరకు పొడిగించిన పంజాబ్‌

లాక్‌డౌన్‌ను మే 1 వరకు పొడిగించిన పంజాబ్‌

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించిన రాష్ర్టాల సంఖ్య రెండుకు చేరింది. కరోనా వైరస్‌ పాజిటివ్‌ల సంఖ్య అధికమవుతుండటంతో లాక్‌డౌన్‌ మే 1 వరకు పొడిగిస్తూ పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికి ఒడిశా కూడా తమ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 101కి చేరింది. ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించారు. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అది మరింత విస్తరించకుండా లాక్‌డౌన్‌ పొడిగించాలని ఆ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఈ నెల 14తో ముగుస్తున్నది. 


logo