మంగళవారం 07 జూలై 2020
National - Jun 22, 2020 , 12:51:08

కొవిడ్‌-19 హెర్బ‌ల్ డ్రింక్ తాగి అనారోగ్యానికి గురైన వ్య‌క్తి

కొవిడ్‌-19 హెర్బ‌ల్ డ్రింక్ తాగి అనారోగ్యానికి గురైన వ్య‌క్తి

కొవిడ్-19 బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ఎవ‌రు ఏం చెప్పినా తింటున్నారు, తాగుతున్నారు. అది ఆరోగ్యానికి మంచిదా? కాదా? అని ఒక క్ష‌ణం కూడా ఆలోచించ‌డం లేదు. ముఖ్యంగా చ‌దువుకున్న‌వాళ్లు సోష‌ల్‌మీడియాలో వ‌చ్చే ఫేక్ న్యూస్‌కు బాగా అడిక్ట్ అవుతున్నారు. ఇటీవ‌ల ఓ వ్య‌క్తి అలానే చేసి హాస్పిట‌ల్ పాల‌య్యాడు.

కేరళకు చెందిన ఒక వ్యక్తి కాలేయ వైఫల్యానికి గురయ్యాడు. ఇది మామూలుగా వ‌స్తే ప‌ర్వాలేదు. క‌రోనా వైర‌స్‌ను నివారించ‌వ‌చ్చ‌ని పేర్కొన్న మూలికా మిశ్ర‌మాన్ని తీసుకున్న త‌ర్వాతే అత‌నికి ఈ ప‌రిస్థితి వ‌చ్చిందని కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ వ‌రుణ్ చెరుప‌రంభ‌త్ చెప్పుకొచ్చారు. నిరూపించ‌బ‌డ‌ని ఎలాంటి మిశ్ర‌మాల‌ను తీసుకోకూడ‌దు అని హెచ్చ‌రించారు. 'ఈ రోజుల్లో త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు ప్ర‌బ‌లంగా ఉన్నాయి. ఇవి ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తున్నాయి' అని ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడైనా తీసుకునే ఆహారం, పానీయాల‌లో జాగ్ర‌త్త వ‌హించండి. logo