మంగళవారం 31 మార్చి 2020
National - Feb 13, 2020 , 03:01:31

కాంగ్రెస్‌కు శస్త్రచికిత్స చేయాలి

కాంగ్రెస్‌కు శస్త్రచికిత్స చేయాలి
  • ఢిల్లీలో పార్టీని పునర్నిర్మించాలి: మొయిలీ

బెంగళూరు/రాయ్‌పూర్‌: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పరిస్థితిపై సమీక్షించి, పునర్నిర్మించడానికి శస్త్రచికిత్స తరహాలో కార్యచరణ (సర్జికల్‌ యాక్షన్‌) చేపట్టాలని సూచించారు. బుధవారం మొయిలీ విలేకరులతో మాట్లాడుతూ ‘బీజేపీని ఓడించగల శక్తి కేజ్రీవాల్‌కు మాత్రమే ఉన్నదని ఓటర్లు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్‌కు ఓటు వేసినా ప్రయోజనం ఉండదని.. పైగా ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య ఓట్లు చీలి బీజేపీకి లబ్ధిచేకూరుతుందని భావించారు. అందుకే కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు ఆప్‌కు తరలిపోయింది’ అని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పందిస్తూ మతాల మధ్య విద్వేషాన్ని రగిలించడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, సీఏఏను ప్రజలపై రుద్దడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో (బీజేపీని ఉద్దేశించి) వారిని ప్రజలు ఓడించారని చెప్పారు. 
logo
>>>>>>