బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 19:02:34

నా మాట‌ల‌ను వ‌క్రీక‌రించారు : మ‌ంత్రి శ్రీ‌రాములు

నా మాట‌ల‌ను వ‌క్రీక‌రించారు : మ‌ంత్రి శ్రీ‌రాములు

బెంగ‌ళూరు : క‌రోనా వైర‌స్‌పై తాను మాట్లాడిన మాటల‌ను ఓ వ‌ర్గం మీడియా వ‌క్రీక‌రించింద‌ని క‌ర్ణాట‌క ఆరోగ్య‌శాఖ మంత్రి బి.శ్రీ‌రాములు అన్నారు. దేవుడు మాత్ర‌మే కోవిడ్‌-19 నుంచి మ‌న‌ల్ని ర‌క్షించాల‌ని అన్న మంత్రి వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యాయి. మంత్రి వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారానికి తెర‌లేపాయి. వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని విప‌క్ష కాంగ్రెస్ విరుచుకుప‌డింది. రాష్ర్టంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌గా మంత్రి వ్యాఖ్య‌లు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని సూచిస్తుంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు పేర్కొన్నారు. 

దీనిపై మంత్రి శ్రీ‌రాములు స్పందిస్తూ... త‌న వ్యాఖ్య‌ల‌ను ఓ వ‌ర్గం మీడియా త‌ప్పుగా వ‌క్రీక‌రించింద‌న్నారు. వ్యాధి నియంత్ర‌ణ ఎవ‌రి చేతిలో ఉందో చెప్పండి. దేవుడు మాత్ర‌మే మ‌నంద‌రినీ ర‌క్షించ‌వ‌ల‌సి ఉంది. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న మాత్ర‌మే వ్యాధి నివార‌ణ‌కు మార్గ‌మ‌న్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి జ‌రిగే వ‌ర‌కు ప్ర‌జ‌ల స‌హ‌కారం ఎంతో ముఖ్య‌మ‌ని అయితే దేవుడు మాత్రమే మ‌నల్ని అన్నింటి నుంచి రక్షించాల్సి ఉంటుందన్న‌ది త‌న వ్యాఖ్య‌ల వెనుక ఉద్ధేశ‌మ‌న్నారు. 


logo