సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 15:21:34

ఒక భార్య త్యాగం.. భర్త, ప్రియురాలిని కలిపిన వైనం

ఒక భార్య త్యాగం.. భర్త, ప్రియురాలిని కలిపిన వైనం

భోపాల్‌: ఒక భార్య తన జీవితాన్ని త్యాగం చేసింది. భర్తను, అతడి ప్రియురాలిని కలిపింది. వారి వివాహానికి సహకరించింది. సినిమా స్టోరీని తలపించే ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది. ఒక జంటకు మూడేండ్ల కింద వివాహమైంది. అయితే భర్త, ఓ యువతి గతం నుంచి ప్రేమించుకుంటున్నారు. పెండ్లి అయిన తర్వాత కూడా అతడు ఆమెను మరిచిపోలేకపోతున్నాడు. దీంతో ఆమెను కూడా పెండ్లి చేసుకుంటానని, ముగ్గురం కలిసి సంతోషంగా ఉండవచ్చని భార్యతో చెప్పాడు.

అయితే చట్టరిత్యా అలా కుదరదని భార్య చెప్పింది. మూడేండ్ల వివాహం తర్వాత భర్త సుఖం కోసం తన జీవితాన్ని త్యాగం చేసేందుకు ఆమె సిద్ధపడింది. ఉన్నతంగా ఆలోచించిన ఆ భార్య చివరకు భర్తకు విడాకులు ఇచ్చింది. ప్రియురాలితో భర్త వివాహానికి ఆమె సహకరించింది. ఈ విడాకుల కేసును వాదించిన మహిళా న్యాయవాది శనివారం ఈ విషయాన్ని తెలిపారు. ఆ భార్య ఎంతో ఉన్నతంగా ఆలోచించి కీలక నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.