శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 15:27:36

బీజేపీ ప‌ప్పులు ఉడ‌క‌వు: గెహ్లాట్‌

బీజేపీ ప‌ప్పులు ఉడ‌క‌వు: గెహ్లాట్‌

జైపూర్‌: ప‌్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌నంద‌రం క‌రోనా మ‌హ‌మ్మారి నిర్మూల‌నపై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఇప్పుడు రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అదే చేస్తున్న‌ద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. కానీ, బీజేపీ మాత్రం రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌రిచేందుకు కుట్ర‌లు చేస్తున్న‌ద‌ని ఆయ‌న ఆరోపించారు. వాజ్‌పేయి హ‌యాంలో ఇలాంటివి జ‌రిగేవి కాద‌ని, 2014 త‌ర్వాత మాత్రం దేశ ప్ర‌జ‌ల‌ను మతం ప్రాతిపదిక‌న విడ‌దీసి పాల‌న సాగిస్తున్నార‌ని గెహ్లాట్ విమ‌ర్శించారు. 

బీజేపీ నేత‌లు మాట‌మాట్లాడితే కాంగ్రెస్ ముక్త్ భార‌త్ అని చెప్పేవార‌ని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసి వారు భ‌య‌ప‌డుతున్నార‌ని అశోక్‌ గెహ్లాట్ ఎద్దేవా చేశారు. బీజేపీ ఎన్ని కుట్ర‌లు చేసినా రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం స్థిరంగా ఉంటుందని, ఐదేండ్ల పూర్తికాలం ప‌రిపాల‌న సాగిస్తుందని ఆయ‌న ధీమా వ్య‌క్తంచేశారు. వచ్చే ఎన్నిక‌ల్లో గెలువ‌డం కోసం తాము ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నామ‌ని గెహ్లాట్ తెలిపారు.     


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo