గురువారం 04 జూన్ 2020
National - May 12, 2020 , 17:38:41

10 జిల్లాల్లో 14,465 పందులు మృతి

10 జిల్లాల్లో 14,465 పందులు మృతి

గువహటి : అసోంలో విజృంభించిన ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ దెబ్బకు వేల సంఖ్యలో పందులు మృతి చెందాయి. అసోంలోని పది జిల్లాల్లో 14,465 పందులు.. ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ వల్ల మృతి చెందినట్లు ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్‌ బోరా మీడియాకు వెల్లడించారు. ఆఫ్రికన్‌ స్వైన్‌ప్లూ నివారణకు అసోం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. పందులు వేల సంఖ్యలో మృతి చెందుతున్న క్రమంలో బాధిత రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అధికారులతో చర్చిస్తుందన్నారు.

ఈ సంక్షోభం నుంచి బయట పడేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యాధి నివారించేందుకు.. చనిపోయిన పందులను లోతైన గుంతల్లో పూడ్చిపెట్టాలని రైతులకు అధికారులు సూచించారు. ఆ గుంతల్లో బ్లీచింగ్‌ పౌడర్‌, ఉప్పుతో పాటు సోడియం క్లోరైడ్‌ను చల్లాలని ఆదేశించారు. పందుల మృతిపై కేంద్రానికి లేఖ రాశామని మంత్రి తెలిపారు.


logo