శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 30, 2020 , 17:35:41

లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ స‌ల‌హాదారు ఎస్ఈసీగా నియామ‌కం

లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ స‌ల‌హాదారు ఎస్ఈసీగా నియామ‌కం

శ్రీ‌న‌గ‌ర్ : జ‌మ్ముక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా స‌ల‌హాదారు కేకే శ‌ర్మ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనంత‌రం ఆయ‌న రాష్ర్ట ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధి రోహిత్ క‌న్సాల్‌ ఈ విష‌యాన్ని ధృవీక‌రిస్తూ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. కేకే శ‌ర్మ 1983 ఐఏఎస్ బ్యాచ్ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, గోవా, మిజోరా కేంద్రపాలిత ప్రాంతాల‌ కేడర్‌కు చెందిన వ్య‌క్తి. గ‌తేడాది న‌వంబ‌ర్ నెల‌లో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌కు స‌ల‌హాదారుడిగా నియ‌మితుల‌య్యారు. త‌న 30 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో వివిధ హోదాల్లో ప‌నిచేశారు. గోవా, ఢిల్లీ రాష్ర్టాల చీప్ సెక్ర‌ట‌రీగా కూడా ప‌నిచేశారు. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ముందు మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ‌శాఖ సెక్ర‌ట‌రీగా ప‌నిచేశారు. అదేవిధంగా చండీగ‌ఢ్ ప‌రిపాల‌న విభాగానికి స‌ల‌హాదారుడిగా కూడా సేవ‌లందించారు.