సోమవారం 13 జూలై 2020
National - Jun 03, 2020 , 01:59:28

ఐఐటీ ఢిల్లీలో ముందస్తు డిగ్రీ

ఐఐటీ ఢిల్లీలో ముందస్తు డిగ్రీ

  • కరోనా నేపథ్యమే కారణం

న్యూఢిల్లీ, జూన్‌ 2: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఈ జాబితాలో ఇంజినీరింగ్‌, వృత్తివిద్య కళాశాలలతోపాటు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)సంస్థలు కూడా ఉన్నాయి. అయితే, తమ సంస్థల్లో చివరి విద్యాసంవత్సరం చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌ ప్రణాళికలు, ఉద్యోగాలపై లాక్‌డౌన్‌ ప్రభావం పడకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పలు ఐఐటీలు తమ గ్రేడింగ్‌ విధానాన్ని మార్చాయి. 

  • ఐఐటీ, ఢిల్లీ- ముందస్తు డిగ్రీ ఇస్తారు. గత గ్రేడ్‌లను లేదా ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించి గ్రేడ్‌ కేటాయిస్తారు.
  • ఐఐటీ, రూర్కీ-పాస్‌ గ్రేడ్‌ (పీ)ను సంతృప్తికర గ్రేడ్‌(ఎస్‌)గా మార్చి కేటాయిస్తారు. 
  • ఐఐటీ, గువహటి-ఇన్‌కంప్లీట్‌ గ్రేడ్‌ (ఐ) కేటాయిస్తారు.
  • ఐఐటీ,గాంధీనగర్‌-గత సెమిస్టర్లలో విద్యార్థి ప్రతిభను అనుసరించి గ్రేడ్‌ కేటాయిస్తారు.
  • ఐఐటీ, ఖరగ్‌పూర్‌-మిడ్‌ సెమిస్టర్లు, వైవా, అసైన్‌మెంట్లలో విద్యార్థులు చూపిన ప్రతిభనుబట్టి గ్రేడ్‌ కేటాయిస్తారు.


logo