నువ్వు ఒక పచ్చదనం
నువ్వు ఒక అమ్మతనం
నువ్వు ఒక మొక్కవే కానీ..
మనిషి మొక్కేంతగా ఎదిగావు!
మొలకెత్తడం నీ పని
నిన్ను పైకి లేపడం మా పని
అశోకుడు నాటించాడు
అందరికీ ఆదర్శంగా నిలిచాడు!
పల్లెకు అందం చెట్లు
పచ్చదనమే సిరుల మెట్ల్లు
పెంచనిచో ఎన్నో పాట్లు
ఓజోన్ పొరకిక తూట్లు!
భయాన్ని పెంచెను కరోనా
చెట్లు పెంచు ఇకనైనా
ఆక్సిజన్ వచ్చు ఎంతయినా
ప్రాణమునిచ్చు సరేనా..!
దోసెడు నీళ్లు పోయి
లాభాలు అందించును వేయి
కేసీఆర్ పెట్టిన పచ్చని పథకం
అదే తెలంగాణకు హరితహారం!!
తుమ్మల కల్పన రెడ్డి
96404 62142