గురువారం 28 మే 2020
National - May 19, 2020 , 13:00:44

శ్రామిక్‌ రైళ్లపై ప్రామాణికాలు పాటించండి: కేంద్ర హోంశాఖ

శ్రామిక్‌ రైళ్లపై ప్రామాణికాలు పాటించండి: కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ: శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల విషయంలో మరోసారి ప్రామాణికాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. వలస కార్మికుల తరలింపు విషయంలో ఇరు రాష్ర్టాల మధ్య సమాచార మార్పిడికి ఏర్పాట్లు చేసుకోవాలని హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా సూచించారు.  రైల్వే శాఖతో సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. రైళ్ల సమయాలు, టికెట్‌ విషయాలన్నీ రైల్వే శాఖ చూసుకోవాలని, వాటికి సంబంధించిన వివరాలు ప్రజలకు స్పష్టంగా తెలపాలని వెల్లడించారు. వలస కూలీల తరలింపుపై ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆరోగ్యశాఖ ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌లో వెల్లడించారు. 


logo