బుధవారం 08 జూలై 2020
National - Jun 20, 2020 , 21:05:24

ఆన్‌లైన్‌లో యోగా వర్క్‌షాప్‌: సంస్థలకు యూపీ సీఎం అభినందన

ఆన్‌లైన్‌లో యోగా వర్క్‌షాప్‌: సంస్థలకు యూపీ సీఎం అభినందన

లక్నో: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆన్‌లైన్‌ యోగా క్యాంప్‌, ఎడ్యుకేషనల్‌ వర్క్‌షాప్‌ను సంయుక్తంగా నిర్వహించనున్న గురు గోరఖ్‌నాథ్‌ యోగా ఇనిస్టిట్యూట్‌, మహరాణా ప్రతాప్‌ శిక్షా పరిషత్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అభినందించారు. కొవిడ్‌-19 నేపథ్యంలో సాంకేతికతను వాడడాన్ని ఆయన ప్రశంసించారు. 

‘గతంలో యోగా దినోత్సవాన్ని అనేకమందితో జరుపుకున్నాం. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇప్పుడు వీలుకావడం లేదు. అయినా డిజిటల్‌ కమ్యూనికేషన్‌ ద్వారా నిర్వహించడం ఆనందంగా ఉంది. కరోనా వైరస్‌ తీవ్రత ఉన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఎవరైతే సాంకేతికతను అర్థం చేసుకోలేరో.. వారు వెనుకబడ్డట్లే’ అని ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో సాంకేతికతను ఉపయోగించి పేదల సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నామన్నారు. ఒక్క క్లిక్‌తోనే 87 లక్షల మందికి పెన్షన్‌ అందజేయగలుగుతున్నామని పేర్కొన్నారు. యోగా మనిషి జీవితంలో సమతుల్యతను తీసుకొస్తుందని యూపీ సీఎం వ్యాఖ్యానించారు. ఆదివారం అందరం ఇళ్లలోనే యోగా చేద్దామని, ఇందుకోసం ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఉమ్మడి ప్రొటోకాల్‌ జారీ చేసిందని ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. logo