సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 22:55:53

సుప్రీం కోర్టుకు ఆదిత్య ఠాక్రే.. యూజీసీ పరీక్షలు రద్దు చేయాలని..

సుప్రీం కోర్టుకు ఆదిత్య ఠాక్రే.. యూజీసీ పరీక్షలు రద్దు చేయాలని..

న్యూ ఢిల్లీ : సెప్టెంబర్ ౩౦లోగా దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల్లో ఫైనల్‌ ఇయర్‌‌ పరీక్షలు నిర్వహిస్తామన్న కేంద్రం, యూజీసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మహారాష్ట్ర మంత్రి, యువసేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  ఫైనల్‌ ఇయర్‌‌ స్టూడెంట్స్‌కు సెప్టెంబర్‌‌లో నిర్వహించనున్న పరీక్షలను రద్దు చేసేలా ఆదేశించాలని కోరారు. శివసేన అనుబంధ సంస్థ యువ సేన తరఫున ఈ పిటిషన్‌ వేశారు.  కరోనా మహమ్మారితో ఆందోళన చెందుతున్న సమయంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రి, యూజీసీ సెప్టెంబర్‌లో భారతదేశంలో విశ్వవిద్యాలయాలు దాని మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే శారీరక మరియు మానసిక ఆరోగ్యం, ఆందోళన, భద్రతను విస్మరిస్తున్నాయని యువసేన ఒక ప్రకటనలో విమర్శించింది. కొవిడ్‌-19 దృష్టిలో పెట్టుకొని యూజీసీ ఫైనల్ ఇయర్‌‌ ఎగ్జామ్స్‌ క్యాన్సిల్‌ చేయాలని, ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితి యూజీసీకి బహుశా అర్థం అయి ఉండదు’ అని ప్రకటనలో పేర్కొంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ఇని‌స్టిట్యూట్స్‌ ఐఐటీలే పరీక్షలు రద్దు చేశాయని గుర్తు చేశారు.  కొవిడ్ -19 మహమ్మారి జాతీయ విపత్తు కింద గుర్తించినప్పుడు విద్యార్థులకు ఉపశమనం ఇవ్వకపోవడం విచారకరమన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo