మంగళవారం 31 మార్చి 2020
National - Feb 24, 2020 , 13:29:58

మొగాంబోను సంతోష‌పెట్టేందుకే..

మొగాంబోను సంతోష‌పెట్టేందుకే..

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను మొగాంబోతో పోల్చారు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రీ.  మొగాంబోను సంతోష‌పెట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ద‌ని అధిర్ విమ‌ర్శ‌లు చేశారు.  ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి కోట్లాది రూపాయాల‌ను ఖ‌ర్చు చేయ‌డం ఎందుకు అని ఆయ‌న ప్ర‌శ్నించారు.  ట్రంప్ వ‌స్తున్నార‌ని.. మురిక‌వాడ‌ల్లో ఉన్న వారిని ఎందుకు వెళ్ల‌గొడుతున్నార‌ని ప్ర‌శ్నించారు. ఇది స‌రైన ప్ర‌వ‌ర్త‌నేనా అని ఆయ‌న అన్నారు.  మొగాంబోను సంతోష పెట్టేందుకు ఇవ‌న్నీ అవ‌స‌ర‌మా అని అధిర్ అన్నారు.  మిస్ట‌ర్ ఇండియా సినిమాలో విల‌న్ పాత్ర పేరు మొగాంబో. ఆ పాత్ర‌ను అమిరిష్ పురి పోషించాడు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియంగా కీర్తి గాంచిన మొతెరా స్టేడియంలో ఇవాళ సుమారు 3 గంట‌ల పాటు ప్రోగ్రామ్‌ను నిర్వ‌హించ‌నున్నారు. కైలాష్ ఖేర్ నేతృత్వంలోని క‌ల్చ‌ర‌ల్ ప్రోగ్రామ్స్ జ‌రుగుతున్నాయి.


logo
>>>>>>