బుధవారం 03 జూన్ 2020
National - Apr 10, 2020 , 16:25:47

‘మోదీజీ.. వలస కూలీలను వారి స్వస్థలాలకు చేరేలా చూడండి’

‘మోదీజీ.. వలస కూలీలను వారి స్వస్థలాలకు చేరేలా చూడండి’

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ స్వస్థలాలకు తరలివెళ్తున్న వలస కూలీలను వారి ఇళ్లకు చేరుకునేలా సహాయం అందించాలని లోక్‌సభలో కాంగ్రెస్‌పార్టీ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి ప్రధాని మోదీని కోరారు. కరోనాను కట్టడి చేయడానికి దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రధాని మార్చి 24న ప్రకటించారు. దీంతో చేసేందుకు పనులు లేకపోవడంతో జీవనోపాధి కోసం నగరాలకు వలస వచ్చిన కూలీలు తమ స్వస్థలాలకు బయలు దేరారు. అయితే రవాణా సదుపాయాలు లేకపోవడం కాలినడకన బయల్దేరారు. దీంతో కరోనాకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, తిండి, బట్టలు సరిగా లేకుండానే రోజుల కొద్ది తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని, అందువల్ల వారంత త్వరగా వారి ఇళ్లకు సురక్షితంగా చేరేలా చూడాలని ఆయన ప్రధానికి లేఖ రాశారు. ఇలా తమ స్వస్థలాలకు వెళ్తున్న నిస్సహాయులైన కూలీల కోసం ప్రత్యేకంగా కోవిడ్‌ ప్రొటెక్షన్‌ రైలును ఏర్పాటు చేయాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు.


logo