బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 18:32:02

‘ సర్‌’ అని సంబోధించాలి!

‘ సర్‌’ అని సంబోధించాలి!

కోల్‌కతా: బెంగాల్, అండమాన్‌లోని అన్ని న్యాయవ్యవస్థ అధికారులతో ‘మై లార్డ్’ లేదా ‘లార్డ్ షిప్’కు బదులుగా ‘సర్‌’ అని సంబోంధించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్‌ రాధాకృష్ణన్ కోరుకుంటున్నారని ఓ అధికారి తెలిపారు. రాష్ట్రంలోని, అండమాన్  నికోబార్ దీవుల్లోని జిల్లా న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులకు రాసిన లేఖలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాయ్ ఛటోపాధ్యాయ్ ప్రధాన న్యాయమూర్తి సందేశాన్ని తెలిపారని పేర్కొన్నారు. ఇకపై హైకోర్టు రిజిస్ట్రీ సభ్యులతో సహా జిల్లా న్యాయవ్యవస్థ అధికారులు గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తిని ‘మై లార్డ్’ లేదా ‘లార్డ్ షిప్’కు బదులుగా ‘సర్’ అని సంబోధించాలని లేఖలో పేర్కొన్నారని వివరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo