శనివారం 30 మే 2020
National - May 17, 2020 , 12:15:53

నరేగాకు అదనంగా రూ. 40 వేల కోట్లు

నరేగాకు అదనంగా రూ. 40 వేల కోట్లు

ఢిల్లీ : చివరి ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు ప్రకటించారు. మొత్తం ఏడు రంగాలకు ప్యాకేజీ ప్రోత్సాహాల్ని ప్రకటించిన కేంద్రం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌కు అదనంగా మరో 40 వేల కోట్లు కేటాయిస్తూ నిర్ణయం వెలువరించింది. కేంద్రం బడ్జెట్లో ఉపాధిహామీ పథకానికి ఇప్పటికే రూ. 61 వేల కోట్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు. పెద్దఎత్తున ఉపాధి కల్పనే లక్ష్యంగా ఉపాధిహామీకి అదనపు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. స్వస్థలాలకు తిరిగి వచ్చే వలస కార్మికులకు కూడా ఉపాధిహామీ పనులు కల్పించనున్నట్లు తెలిపారు. దీంతో అధిక ఉత్పత్తి ద్వారా గ్రామీణ ఆర్థికానికి ఊతం ఇచ్చినట్లు అవుతుందన్నారు. 


logo