సంస్కరణల అమలు రాష్ట్రాలకు కేంద్రం అదనపు సాయం

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన నాలుగు సంస్కరణలను అమలు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం అదనపు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రధానమైన నాలుగు సంస్కరణల్లో మూడు సంస్కరణలు అమలు చేసిన మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్రం మూలధన వ్యయం కోసం ప్రత్యేక సహాయంగా వెయ్యి నాలుగు కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్ధికశాఖ ప్రకటించింది. సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్రాలకు అదనపు సాయం కింద రూ. 10 వేల 250 కోట్లు కేంద్రం కేటాయించింది. దీనిలో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 344 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ. 660 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రాలు వివిధ ఆర్ధిక సంస్థల నుంచి తీసుకునే అప్పులకు సంబంధం లేకుండానే అదనపు సాయం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే కేటాయించిన మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 172 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ. 330 కోట్లు తొలివిడత నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్ధికశాఖ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించినా..కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత సంస్కరణలైన.. ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు, సులభతర వాణిజ్యం, పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలు అమలు చేయడంలో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ముందు భాగాన ఉన్నాయని పేర్కొంది.
ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా రాష్ట్రాల్లో అనేక సంస్కరణల తీసుకువచ్చే పథకానికి గత ఏడాది అక్టోబర్ 12న కేంద్రం శ్రీకారం చుట్టుంది. అప్పటి నుంచి రాష్ట్రాలు అమలు చేసే విధానానికి అనుగుణంగా దశల వారీగా అదనపు నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ పథకంలో భాగంగా తెలంగాణకు రూ. 179 కోట్లు ప్రకటించి రూ. 89.50 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది. తమిళనాడు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలకు తొలిదఫా నిధులు విడుదల అయినట్లు ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది.
తాజావార్తలు
- భూ తగాదాలతో వ్యక్తి హత్య
- యాదాద్రిలో భక్తుల రద్దీ..
- పాత నోట్లపై కేంద్రం క్లారిటీ..!
- తిరుమలలో త్రివర్ణ పతాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో
- కాళేశ్వరం నిర్వాసితులకు ఉత్తమ ప్యాకేజీ
- అమర్నాథ్ యాత్ర కోసం ఏర్పాట్లు షురూ!
- రియల్మీ X7 సిరీస్ విడుదల తేదీ ఖరారు!
- అనైతిక బంధం : సోదరిని కాల్చిచంపిన వ్యక్తి
- అయోధ్యలో మసీదు నిర్మాణ పనులు షురూ..
- ఉర్దూ పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల