శనివారం 28 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 14:35:10

అదానీ గ్రూప్‌ చేతికి అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌

అదానీ గ్రూప్‌ చేతికి అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌

అహ్మదాబాద్‌ : సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలను అదానీ గ్రూప్ ఆదివారం నుంచి చేపట్టిందని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, అదానీ ఎయిపోర్ట్స్‌ అధికారులు పత్రాలపై సంతకాలు చేశారు. ఇంతకు ముందు ఏఏఐ లక్నో, మంగళూరు విమానాశ్రయాలను అదానీ గ్రూప్‌కు 50 సంవత్సరాల కాలానికి లీజుకు ఇచ్చింది. దేశంలోని ఆరు ప్రధాన నగరాలైన లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గౌహతిలోని విమానాశ్రయాలను కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రైవేటీకరించింది. పోటీ బిడ్డింగ్ ప్రక్రియ అనంతరం.. అదానీ గ్రూప్ 50 సంవత్సరాల పాటు వాటన్నింటినీ నిర్వహించే హక్కులను సొంతం చేసుకుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.