శనివారం 30 మే 2020
National - May 18, 2020 , 00:25:35

చైనాలో అసలు కేసులు 8 రెట్లు ఎక్కువ!

చైనాలో అసలు కేసులు 8 రెట్లు ఎక్కువ!

న్యూఢిల్లీ: కరోనా కేసుల విషయమై చైనా ప్రకటించిన అధికారిక సంఖ్య కంటే అసలు బాధితులు ఎనిమిది రెట్లకు పైగా ఉంటారని వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న ‘ఫారిన్‌ పాలసీ మ్యాగజైన్‌ అండ్‌ 100 రిపోర్టర్స్‌' ఓ వార్తను ప్రచురించింది. తమ దేశంలో సుమారు 82 వేల కేసులు ఉన్నాయని చైనా ప్రకటించింది. అయితే 6.40 లక్షల మంది బాధితులు ఉంటారని 100 రిపోర్టర్స్‌ పేర్కొన్నది. చైనాలోని 230 నగరాల్లోని హాస్పిటళ్ల నుంచి సేకరించిన సమాచారం,  చైనా మిలిటరీకి చెందిన నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డిఫెన్స్‌ టెక్నాలజీ నుంచి లీకైన డేటా ప్రకారం ఈ నిర్ధారణకు వచ్చామని తెలిపింది. 


logo