సోమవారం 25 జనవరి 2021
National - Dec 02, 2020 , 01:04:47

శివసేనలో చేరిన నటి ఊర్మిళ

శివసేనలో చేరిన నటి ఊర్మిళ

ముంబై: బాలీవుడ్‌ నటి ఊర్మిళ మటోద్కర్‌ శివసేనలో చేరారు. మంగళవారం శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఊర్మిళను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలంటూ ఇప్పటికే గవర్నర్‌ కోశ్యారీకి సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్‌పై పోటీ చేసిన ఊర్మిళ ఓడిపోయారు. అనంతరం ఆమె సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చారు. ఊర్మిళ శివసేనలో చేరిన వెంటనే తోటినటి కంగనా రనౌత్‌పై విమర్శలు చేశారు. కంగనా రనౌత్‌కు అనవసరంగా ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామన్నారు.


logo