గురువారం 26 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 02:52:50

సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు

సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు

కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ(85) ఆదివారం కన్నుమూశారు. నెలరోజులుగా  ఆయన కరోనాతో పోరాడుతున్నారు. కోల్‌కతాలోని బెల్లే వ్యూ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అక్టోబర్‌ 6వ తేదీన సౌమిత్రకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు సార్లు ప్లాస్మా చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. సౌమిత్ర ఛటర్జీ 1935 జనవరి 19న జన్మించారు. దిగ్గజ దర్శకుడు సత్యజిత్‌ రే దర్శకత్వం వహించిన ‘అపుర్‌ సంసార్‌' సినిమా(1959)తో కెరీర్‌ను ప్రారంభించారు. సౌమిత్ర మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన అంత్యక్రియల్లో పశ్చిమబెంగాల్‌ సీఎం మమత పాల్గొన్నారు.